టీమ్ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జట్టులో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పాత్ర చాలా కీలకం. టి20 ప్రపంచ కప్ లో అతడు ఆడటం ఎంతో అవసరం. అటు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సేవలను కూడా జట్టు బాగా వినియోగించుకుంటోంది. అయితే.. క్రికెట్ ప్లేయర్ రవీంద్ర జడేజా మైదానంలోనే కాదు బయట కూడా ఆల్రౌండ్ ప్రదర్శన చేయగలనని నిరూపిస్తున్నారు.
తాజాగా తన ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లిన జడేజా అక్కడ సరదాగా ఎంజాయ్ చేశారు. ఓ పార్టీలో పాల్గొని ‘ముక్కాలా ముక్కాబులా లైలా’ పాటకు చిందులు వేసిన వీడియోను CSK తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. ‘జీవితంలో సోమవారాలు వచ్చినప్పుడు జడ్డులా ఎంజాయ్ చేయాలి’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ కూడా ఇచ్చింది. కాగా, ఇటీవల జరిగిన IPL 2023 లో అరుదైన క్లబ్‌లో చోటు దక్కించుకున్నాడు రవీంద్ర జడేజా. ఐపీఎల్ చరిత్రలో 1000కి పైగా పరుగులు చేసి, 150కి పైగా వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలోకి చేరారు టీమ్ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.