శివసేనకు ఏం ఢోకా లేదు..ఇద్దరు ఎమ్మెల్యే మళ్లీ వచ్చారు – సంజయ్‌ రౌత్‌ సంచలనం

మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయం వేడెక్కింది. అయితే.. మ‌హారాష్ట్రలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభంపై శివ‌సేన పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీ ఇప్పటి వరకు ఎలాంంటి ఢోకా లేదని.. పార్టీ పటిష్టంగా ఉందన్నారు.

తమ ఎమ్మెల్యేలను బీజేపీ బంధించిందని ఫైర్‌ అయ్యారు. బయటకు వెళ్లిన ఇద్దరు ఎమ్మెల్యేలు..తిరిగి తమ గూటికి వచ్చారని వెల్లడించారు సంజయ్‌ రౌత్‌. ఇక పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.