సోనియా, రాహుల్‌, ప్రియాంక తమ పదవులకు రాజీనామా?

-

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీతో పాటు పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాలు తమ తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేయనున్నారట.

కాంగ్రెస్‌ పార్టీ వర్గాలను ఉటంకిస్తూ.. జాతీయ మీడియాలో ఈ వార్తను ఇస్తోంది. ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ హోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్టీ దుస్థితికి కారణమెవరంటూ పార్టీలోని సీనియర్లు అప్పుడే నిరసన గళం విప్పారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం అంటే నేడు పార్టీలో అత్యున్నత నిర్ణయాక విభాగం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం ఇవాళ జరుగనుంది. అయితే.. ఈ సమావేశంలోనే.. కాంగ్రెస్‌ పార్టీ పదవులకు రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాలు రాజీనామా చేసే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news