‘స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ జంషెడ్​ ఇరానీ కన్నుమూత

-

టాటా స్టీల్ మాజీ ఎండీ, ప్రముఖ వ్యాపారవేత్త జంషెడ్ జె ఇరానీ(86) సోమవారం అర్ధరాత్రి జంషెద్​పుర్​లో మరణించినట్లు టాటాస్టీల్ తెలిపింది. ఇరానీకి టాటా స్టీల్‌తో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. ఆయన 2011 జూన్​లో టాటా స్టీల్ బోర్డు నుంచి తప్పుకున్నారు.

“స్టీల్ మ్యాన్​ ఆఫ్​ ఇండియాగా పేరు గాంచిన పద్మభూషణ్ డాక్టర్​ జంషెడ్ జె ఇరానీ మరణం పట్ల చాలా బాధపడుతున్నాము. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం” అని టాటా స్టీల్​ ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news