నేను బ్రిటన్ పీఎం అత్తగారినంటే నమ్మలేదు : సుధామూర్తి

-

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి గురించి తెలియని వారు అరుదు. నారాయణమూర్తి సతీమణిగానే గా.. రచయిత్రి, వితరణశీలి, సామాజిక కార్యకర్తగా సుధామూర్తి ఎంతో మందికి సుపరిచితురాలు. ఇటీవల ఆమె ప్రముఖ బాలీవుడ్‌ టాక్‌ షో ‘ది కపిల్‌ శర్మ షో’లో పాల్గొన్నారు. ఈ షోలో తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన వస్త్రధారణ కారణంగా లండన్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె బయటపెట్టారు.

‘‘ఇటీవలే నేను యూకే వెళ్లాను. అక్కడ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు లండన్‌లో ఎక్కడ ఉంటారు? అని ప్రశ్నించారు. నా కుమారుడు యూకేలోనే ఉంటాడు. కానీ అతడి పూర్తి అడ్రసు నాకు తెలియదు. దీంతో నేను నా అల్లుడు రిషి సునాక్‌ నివాసమైన 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ను అడ్రస్‌గా రాశాను. అది చూడగానే ఇమ్మిగ్రేషన్‌ అధికారి నన్ను ఎగాదిగా చూసి.. ‘జోక్‌ చేస్తున్నారా?’ అని అడిగారు. నేను నిజమే అని చెప్పినా వారు నమ్మినట్లు నాకు అన్పించలేదు. నాలాంటి సింపుల్‌ మహిళ ప్రధాని అత్తగారంటే అక్కడ ఎవరూ నమ్మలేదు’’ అని నాటి సంఘటనను సుధామూర్తి గుర్తుచేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news