ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. కొత్త ఫీచర్స్ తో యువతను ఆకట్టుకుంటుంది.. ఇక ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. అదే.. ‘ఛాట్ లాక్’ ఫీచర్. ఈ ఫీచర్‌తో వినియోగదారుల ఛాట్స్‌కు అదనపు భద్రత లభిస్తుందని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ఛాట్ లాక్‌ను మీ ముందుకు తీసుకొస్తుండటం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. మీ కీలకమైన ఛాట్స్‌కు ఇది అదనపు భద్రతను కల్పిస్తుంది అని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఏదైనా ఛాట్‌ను లాక్ చేస్తే.. అది ఇన్‌బాక్స్‌లో ఇక కనిపించదు.. ఈ ఛాట్ మరో ఫోల్డర్‌కు మారిపోతుంది. ఆ ఫోల్డర్‌ను పాస్వర్డ్ లేదా ఫింగర్‌ప్రింట్‌తోనే ఓపెన్ చేయగలరు. సంబంధిత ఛాట్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా.. ఆ నోటిఫికేషన్ ఆటోమెటిక్‌గా హైడ్ అయిపోతుంది.ఈ ఫీచర్ ను రానున్న నెలల్లో ఈ ఛాట్ లాక్ ఫీచర్‌కు మరిన్ని ఆప్షన్స్ తీసుకొస్తాము. యునీక్ పాస్‌వర్డ్‌తో లాక్ చేసుకునే వెసులుబాటును కల్పించడం ఇందులో ఒకటి అని ఈ ఫేస్బుక్ ఆధారిత వాట్సాప్ పేర్కొంది.
చాట్ ను ఎలా లాక్ చెయ్యాలి?
ముందుగా మీ వాట్సాప్‌ను అప్డేట్ చేయండి. లేటెస్ట్ వర్షెన్ డౌన్లోడ్ అవుతుంది.
మీరు ఏ ఛాట్‌ని లాక్ చేయాలని భావిస్తున్నారో.. దాని ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయండి.
మీకు కొత్తగా ఓ ఆప్షన్ కనిపిస్తుంది. అదే ‘ఛాట్ లాక్’. డిసప్పియరింగ్ మెసేజ్ మెన్యూ కింద ఉంటుంది.
ఛాట్ లాక్‌ను ఎనెబుల్ చేయండి. ఇందుకు మీరు పాస్వర్డ్ లేదా ఫింగర్‌ప్రింట్ ఇవ్వాల్సి ఉంటుంది.
లాక్ చేసిన ఛాట్‌ను చూడాలంటే.. మీ వాట్సాప్ హోం పేజ్ని కిందకి స్వైప్ చేయండి. అప్పుడు మీరు పాస్వర్డ్ లేదా ఫింగర్‌ప్రింట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.. అంతే.. ఇక ఇంకా ఫ్యూచర్ లో ఎన్నో ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది..