స్వలింగ సంపర్కుల వివాహాలపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

-

స్వలింగ సంపర్కుల వివాహానికి ఆమోదం కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్​పై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థాన ద్విసభ్య ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. హైకోర్టుల్లో పెండింగ్​లో ఉన్న కేసుల వివరాలను చెప్పాలని సూచించింది.

హైద‌రాబాద్‌కు చెందిన గే జంట వేసిన ఓ పిటిష‌న్‌పై ఇవాళ సుప్రీంకోర్టు ఈ కీల‌క ఆదేశాలు జారీ చేసింది. స్వ‌లింగ సంప‌ర్కుల వివాహాల‌పై త‌మ అభిప్రాయాన్ని వెల్ల‌డించాల‌ని కేంద్రానికి సుప్రీం నోటీసులు ఇచ్చింది. అటార్నీ జ‌న‌ర‌ల్ ఆర్ వెంక‌ట‌ర‌మ‌ణికి కూడా ఆ నోటీసులు వెళ్లాయి. ప్ర‌త్యేక వివాహం చ‌ట్టం కింద పెళ్లి చేసుకున్న స్వలింగ సంపర్క జంట‌ల‌కు ప్ర‌భుత్వం గుర్తింపు ఇవ్వాల‌ని కొన్ని జంట‌లు సుప్రీంలో పిటిష‌న్ వేశాయి. హైద‌రాబాద్‌లో జీవిస్తున్న సుప్రియో చ‌క్ర‌బ‌ర్తి, అభ‌య్ దంగ్ అనే గే జంట కూడా పిటిస‌న్ వేసింది. త‌మ‌కు న‌చ్చిన వారిని పెళ్లి చేసుకునే హ‌క్కు ఎల్‌జీబీటీక్యూ వ‌ర్గానికి వ‌ర్తించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైద‌రాబాద్ జంట త‌మ పిటిష‌న్‌లో కోరింది. భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి డీవై చంద్ర‌చూడ్, జ‌స్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఆ పిటిష‌న్ల‌పై ఇవాళ విచార‌ణ చేప‌ట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news