మణిపుర్ ఘర్షణలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

-

మణిపుర్ హింసాత్మక ఘటనలపై సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి, మణిపుర్ సర్కారుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘర్షణల బాధితుల కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని  స్పష్టం చేసింది. సహాయక శిబిరాల్లో ఆహారం, వైద్య సదుపాయాలు సహా అన్ని రకాల కనీస ఏర్పాట్లు చేయాలని  ఆదేశించింది. హింస తలెత్తిన తర్వాత ఏర్పడిన పరిస్థితులను మానవతా సమస్యలుగా పేర్కొన్న సుప్రీం ధర్మాసనం.. ఆశ్రయం కోల్పోయిన వారి పునరావాసం కోసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

ప్రార్థనా స్థలాలను సంరక్షించడంపై దృష్టిసారించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. హింస అదుపులోకి వచ్చిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వివరణను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంపై సోమవారం విచారణ చేపట్టింది. మణిపుర్లో పరిస్థితులను అదుపు చేసేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్రం, మణిపుర్ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 17కు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news