BREAKING : తమిళనాడు సీఎం స్టాలిన్ ఆసుపత్రిలో చేరిక

-

BREAKING : తమిళనాడు సీఎం స్టాలిన్ ఆసుపత్రిలో చేరారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని.. కావేరీ ఆస్పత్రిలో.. సీఎం స్టాలిన్‌ ఆస్పత్రి చేరినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. సీఎం స్టాలిన్‌ కు నిన్నటి నుంచి కరోనా లక్షణాలు ఉండటంత… కావేరీ ఆస్పత్రిలో చేరినట్లు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు వైద్యులు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తమ నివేదిక లో పేర్కొన్నారు. కాగా.. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిన అనంతరం… తనదైన స్టైల్లో నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో తన మార్క్ ఉండేలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ సీఎం స్టాలిన్ సత్తా చాటుతున్నారు. మునుపెన్నడూ ఏ సీఎం వ్యవహరించని రీతిలో సీఎం స్టాలిన్… సంచలన నిర్ణయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నింపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news