జమిలిపై కేంద్రం వెనకడుగు !

-

జమిలిపై కేంద్రం వెనకడుగు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. లోక్ సభ బిజినెస్ లిస్టు నుంచి బిల్లు తొలగించిందట కేంద్ర సర్కార్‌. దీంతో నేడు సభ ముందుకు బిల్లు రానట్టేనని చెబుతున్నారు. “ఒకే దేశం, ఒకే ఎన్నిక” కు కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన దేశంలో అన్ని చట్టసభలకు ఒకేసారి ఎన్నికలు జరుగనున్నాయి. 2029 మే-జూన్ లో లోకసభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని “లా కమిషన్” సిఫార్సు కూడా చేసింది. రాష్ట్రాల అసెంబ్లీ లకు వరుసగా వచ్చే ఏడాది నుంచి, ప్రతి ఏడాది ఎన్నికలు జరుగుతాయి.

jamili

వచ్చే ఏడాది, 2025 లో బీహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. 2026 లో అస్సాం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. 2027 లో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ అసెంబ్లీ లకు ఎన్నికలు ఉన్నాయి. 2028 లో 9 రాష్ట్రాల అసెంబ్లీలకు—త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్నాటక, మిజోరమ్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ—ఎన్నికలు ఉన్నాయి. ఒక వేళ జమిలీ బిల్లుకు అమోదం లభిస్తే..2027 జమిలి ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంటుందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version