లోక్ సభ సెక్రటేరియట్ విధించిన అనర్హత వేటు పై మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ స్పందించిన తీరును తప్పుపట్టారు బిజెపి ఎంపీ రవిశంకర్ ప్రసాద్. ప్రెస్ మీట్ లో రాహుల్ గాంధీ చెప్పినవన్నీ అబద్ధాలేనని అన్నారు. విమర్శించే హక్కు మీకు ఉంది కానీ.. అవమానించే హక్కు లేదని అన్నారు. రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగానే వెనుకబడిన తరగతుల వారిని అవమానించారని ఆరోపించారు.
దేశంలో ఓబీసీలను కించపరిచేలా రాహుల్ మాట్లాడారని.. క్షమాపణ చెప్పాలని కోర్టు కోరిన రాహుల్ చెప్పలేదని అన్నారు. అందుకే ఆయనకు శిక్ష పడిందని స్పష్టం చేశారు రవిశంకర్ ప్రసాద్. కోర్టు తీర్పును కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నిస్తుందని మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలకు, అదాని అంశానికి సంబంధమే లేదన్నారు. ఇలాంటి కేసుల్లో రాహుల్ గాంధీని ఒక్కరినే అనర్హుడిగా ప్రకటించలేదని.. గతంలో కూడా 32 మంది పై అనర్హత వేటు పడిందని అన్నారు.