వైరల్: “మోడీ”కి ముచ్చెమటలు పట్టిస్తున్న “ప్రియాంక” మూడు “ఫోటో”లు!

-

హత్రాస్ సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రగిల్చిన సంగతి తెలిసిందే. రేప్ బాధితురాలిని పోలీసులు అర్థరాత్రి గుట్టుచప్పుడు కాకుండా దహన సంస్కారాలు నిర్వహించడం దేశంలోని ప్రజలను ఆగ్రహానికి గురిచేసింది. యుపి ప్రభుత్వ – పోలీసుల చర్యలు ప్రతిరోజూ మరీ అనాగరికంగా మారుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

“ఒక సన్యాసి రాష్ట్ర ప్రజలను పాలిస్తే ఫలితాలు ఇలానే ఉంటాయి” అని కాంగ్రెస్ నేతలు నేరుగా యూపీ సీఎం యోగిపై దాడి చేస్తున్నారు! ఈ విషయంలో ఈ సంఘటనలో బాదితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన రాహుల్ – ప్రియాంక విషయంలో… మూడు ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. మోడీ & కో కి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి!!

కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ – ప్రియాంక గాంధీలు.. ఇతర మద్దతుదారులతో కలిసి హత్రాస్ లోని హత్యాచార బాధితురాలి వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఒక మగ పోలీసు.. ప్రియాంక గాంధీ చొక్కా పట్టుకున్నాడు. ఒక ఫోటో దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. దీంతో “మోడీ – యోగీ లాంటి వారికి ఆడపిల్లల విలువలు ఏమి తెలుస్తాయి” అంటూ ఫైరవుతున్నారు కాంగ్రెస్ నేతలు! జాతీయ నాయకురాలికే ఇలా జరిగితే.. ఇక సామాన్యుల పరిస్థితి యూపీ పోలీసుల చేతుల్లో ఎలా ఉంటుందో అని మహిళా లోకం నినదిస్తోంది!

ఇదే సమయంలో… ఆమెపై లాఠీలు ఎత్తిన సందర్భంగా.. ఆ లాటీకి తన చేతులు అడ్డుపెట్టి వీరనారిలా ముందుకు సాగిన ప్రియాంక ఫోటో ఒకటి మరో సంచలనంగా మారింది! ఇవి ప్రియాంకలో ఒక కోణం అయితే.. మరో ఫోటో… హత్యాచార బాధితురాలి తల్లిని కౌగిలించుకున్నది. ఈ ఫోటో మరింతగా అందరినీ కలిచివేసింది.

ఈ విషయంలో ప్రియాంకకు మద్దతుగా నిలిచిన శివసేన… యూపీలో అసలు మహిళా పోలీసులే లేరా.. ప్రియాంక చొక్కాను మగ పొలీసులు పట్టుకోవడం ఏంటని యూపీ సీఎం యోగిని నిలదీశారు! దీంతో… ఈ మూడు ఫోటోలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి!

-Ch Raja

Read more RELATED
Recommended to you

Latest news