మోదీ యూఎస్ టూర్ చరిత్రలో నిలిచిపోతుంది : అమెరికా విదేశాంగ మంత్రి

-

మరికొద్ది రోజుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు. వివిధ రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారంపై మోదీ, బైడెన్ చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీకి బైడెన్ విందు ఇవ్వనున్నారు. జూన్ 22న అధికారిక డిన్నర్ కార్యక్రమం ఉంటుందని శ్వేతసౌధం తెలిపింది.

మరోవైపు మోదీ అమెరికా పర్యటన చరిత్రలో నిలిచిపోతుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పేర్కొన్నారు. ‘అమెరికా- ఇండియా బిజినెస్ కౌన్సిల్’ నిర్వహించిన ‘ఇండియా ఐడియాస్ సమిట్’ వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు అత్యంత కీలకమని చెప్పారు.

“గతేడాది ఇరుదేశాల మధ్య వాణిజ్యం 191 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత్​కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారింది. అమెరికా కంపెనీలు భారత్​లో 54 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. భారత కంపెనీలు అమెరికాలో 40 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. త్వరలోనే ప్రధాని మోదీ చారిత్రక పర్యటన ఉంది. ఈ పర్యటన ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.”
– ఆంటోనీ బ్లింకెన్, అమెరికా విదేశాంగ మంత్రి

Read more RELATED
Recommended to you

Latest news