ప్రధాని మోదీతో మమతా బెనర్జీ భేటీ

-

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయితోపాటు ఇతర సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం.

నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరయ్యేందుకు గానూ గురువారం దిల్లీ చేరుకున్న మమతా బెనర్జీ.. నాలుగు రోజులపాటు రాజధానిలోనే పర్యటించననున్నారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతోనూ మమతా భేటీ కానున్నారు.

అయితే, అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన మంత్రి పార్థా ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రితో ఆ రాష్ట్ర సీఎం దీదీ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రధానమంత్రి అధ్యక్షతన నీతి ఆయోగ్‌ సమావేశం ఆగస్టు 7న జరగనుంది. ఇందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు దిల్లీ చేరుకున్న మమతా బెనర్జీ.. ఇదే సమయంలో విపక్షపార్టీల నేతలతోనూ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news