నాని అభిమానులకు గుడ్‌న్యూస్‌.. మరో అప్డేట్‌ ఇచ్చిన నేచురల్‌ స్టార్‌

-

నేచురల్‌ స్టార్‌ నాని తన అభిమానులకు న్యూయర్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు నాని. నానికిది 30వ చిత్రం. సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను జనవరి 1న సాయంత్రం 4.05 గంటలకు చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. నాని పక్కన ఏ హీరోయిన్ నటిస్తారు ? సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్ల గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మైల్‌స్టోన్ మూవీగా రాబోతున్న 30వ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారో అనౌన్స్ మెంట్ లో ప్రకటిస్తారో చూడాలి.

Natural Star Nani Going to Announce His 30th Movie on January 1, 2023 -  Sakshi

మరోవైపు.. నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రఫ్ లుక్ లో కనిపిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, అందాల భామ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వెరైటీ ప్రేమ కథాచిత్రంగా రూపొందుతోంది. ఇందులో సముద్రఖని, పూర్ణ, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, రోషన్ మ్యాథ్యూ, సాయికుమార్, జరీనా వవాబ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.మార్చి 30, 2023న విడుదల కానున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news