Ram Charan: RC 15 ఎలా ఉండబోతుందో చెప్పేసిన నవీన్ చంద్ర..!

-

నటుడు నవీన్ చంద్ర..పలు తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ యాక్టర్ అయిపోయారు. ఇటీవల విడుదలైన ‘పరంపర’ సీజన్ 2లో ఇరగదీశాడు. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ చంద్ర అని చెప్పొచ్చు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నవీన్ చంద్ర..రామ్ చరణ్ -శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న RC 15 ఫిల్మ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Actor Naveen Chandra in Dalam Movie Latest Pictures

తను నటించిన ప్రాజెక్ట్స్ కొవిడ్ వలన ఓటీటీకి షిఫ్ట్ అయ్యాయని, కొన్ని త్వరలో థియేటర్లలో విడుదల కాబోతున్నాయని చెప్పుకొచ్చారు నవీన్ చంద్ర. తాను నటిస్తున్న RC 15 ఫిల్మ్ షూటింగ్ జరుతున్నదని చెప్పారు. తాను ఒక సిన్సియర్ స్టూడెంట్ లాగా సెట్స్ కు వెళ్లి షూటింగ్ లో పాల్గొంటున్నానని వివరించారు.

అభిమానుల అంచనాలను మించి సినిమా ఉంటుందని తెలిపారు. శంకర్ సినిమా ఎలా ఉండబోతుందో ఊహించుకుంటే చాలని, అదొక డిఫరెంట్ వరల్డ్ అని చెప్పారు. ఎక్స్ పెక్టేషన్స్ ఎంత పెట్టుకుంటే అంత తప్పకుండా రీచ్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ వార్త తెలుసుకుని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. RRR వంటి చిత్రం తర్వాత రామ్ చరణ్ చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ RC 15 కాగా, ఇది డెఫినెట్ గా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version