గత 7 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వీరు వివాహం ఎప్పుడు చేసుకుంటారు అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈరోజు వివాహ బంధంలోకి అడుగుపెడుతూ.. తమ బ్యాచిలర్ లైఫ్ కి పులిస్టాప్ పెట్టేసారు. ఇకపోతే నయనతార 18 సంవత్సరాల పాటు నిరంతరంగా సినీ పరిశ్రమకు చేస్తున్న కృషికి.
ఎంతో మంది ఆమెకు లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును కూడా అంకితం చేశారు. ఇప్పటికే తన వ్యక్తిగత విషయం లో రెండు లవ్ ఫెయిల్యూర్స్ ను చూసిన నయనతార ఎట్టకేలకు దర్శకుడు విగ్నేష్ ను వివాహం చేసుకుంది. ఇకపోతే నయనతార – విఘ్నేష్ శివన్ వివాహ వేడుకకు ఎవరెవరు హాజరయ్యారు అనే విషయం ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
మహాబలిపురం లో హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకకు ఎంతో మంది సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కూడా వీరి వివాహానికి హాజరయ్యారు. ఇకపోతే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి నయనతార పెళ్లికి హాజరయ్యారు. ఇకపోతే చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి చెల్లి పాత్రలో నయనతార నటిస్తోంది.
ఇకపోతే భారతదేశ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సమంత కూడా వీరి వివాహానికి హాజరయ్యింది. ఇటీవల సమంత, నయనతార ఇద్దరూ కలిసి విజయ్ సేతుపతితో నటించిన కన్మణి రాంబో ఖతీజా సినిమాలో కలిసి నటించారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరికీ మంచి సాన్నిహిత్యం ఏర్పడడంతో సమంత నయనతార పెళ్ళికి హాజరయ్యింది. ఇక కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి మరెంతో మంది ప్రముఖులు హాజరైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలు తెలియాలంటే ఇంకో ఒక రోజు వేచి చూడక తప్పదు.