ఓటీటీలో నయనతార ‘O2’ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

-

లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే లేడీ ఓరియెంటెడ్ సినిమా తీసి.. లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగారు. నేట్రికన్, అనామిక, కర్తవ్యం, మయూరి, కోకో కోకిల వంటి పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఈమె నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా ఓ2 (O2). ప్రముఖ దర్శకుడు జీఎస్.విక్నేష్ దర్శకత్వంలో ఈ సినిమాను థియేటర్‌లో రిలీజ్ చేయకుండా.. నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు.

ఓ2-నయనతార
ఓ2-నయనతార

ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. థ్రిల్లర్ డ్రామా మూవీగా తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 17వ తేదీన ఓటీటీ సంస్థ డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో నయనతార 8ఏళ్ల పిల్లాడికి తల్లిగా నటిస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో లీనా, రిత్విక్, అడకులం, మనోహర్, మురుగదాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news