షాకింగ్ : తల్లి కాబోతున్న హీరోయిన్ నయనతార !

-

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట్లో హీరోయిన్ గానే కొనసాగిన ఈ లేడీ సూపర్ స్టార్…. ఆ తర్వాత… లేడీ హీరోగా కూడా సినిమాలు కూడా చేసింది. అయితే.. దర్శకుడు విగ్నేష్‌ శివన్‌-నయన తార ప్రస్తుతం లవ్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. 5 సంవత్సరాలుగా… వీరు ప్రేమించుకుంటుండగా.. ఇదిగో పెళ్లి, అదిగో పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ జంట మాత్రం పెళ్లి భోజనం పెట్టడం లేదు.

అయితే తాజాగా ఈ జంట పెళ్లి కాకముందే ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సరోగసీ ద్వారా తల్లి కావడానికి నయనతార నిర్ణయం తీసుకుందని సమాచారం అందుతోంది. ఇప్పటికే సరోగసీ ద్వారా బాలీవుడ్ హీరోయిన్లు ప్రీతి జింటా, శిల్పా శెట్టి, ప్రియాంక చోప్రా లు తల్లులు అయ్యారు. ఈ నేపథ్యంలోనే నయనతార కూడా వారి బాటలోనే నడవాలని నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు ఇప్పటికే విగ్నేష్ శివన్ కూడా ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news