Nazriya : అందాలతో రెచ్చగొడుతున్న మళయాళీ ముద్దుగుమ్మ

-

నాచురల్ స్టార్ నాని నటిస్తోన్న తాజా సినిమా ‘ అంటే సుందరానికీ’. మళయాళీ ముద్దుగుమ్మ నజ్రియా ఫహాద్ హీరోయిన్ గా ‘ అంటే సుందరానికీ’ మూవీ లో నటిస్తుంది. పలు తమిళ, మళయాళ సినిమాలో తెలుగు వారికి పరిచయం అయిన నజ్రియా తొలిసారిగా స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటిస్తోంది.

తాజాగా ‘ అంటే సుందరానికీ’ మూవీలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది అనేదానికి క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్ ఈ సినిమాలో నజ్రియా… లీలా థామస్ గా ఓ క్రిష్టియన్ అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో తెలుస్తోంది.


గతంలో ‘ రాజా – రాణి ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నజ్రియా పరిచయమే.

ప్రస్తుతం ఈ అమ్మడు భర్త ఫహాద్ ఫాజిల్ పుష్ఫ సినిమాతో విలన్ గా చేస్తూ… తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చాడు.

‘ అంటే సుందరానికీ’ మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా… వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జూన్ 10న ఈ సినిమా రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపత్యం లోనే నజ్రియా పిక్స్ వైరల్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news