సోషల్ మీడియా ఎంత వేగంగా పాపులర్ అవుతుందో అంతకు మించి ఫేక్ సమాచారం కూడా ఎక్కువగా వ్యాపిస్తుంది..అధికారులు ఇలాంటి వార్తలను అసలు నమ్మవద్దని ఎంతగా చెప్పినా కూడా కొందరు నిజమని నమ్మి మోస పోతున్నారు.. తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. భారత ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తున్నారని వార్త గుప్పుమంది.అది ఫేక్ న్యూస్ అని అధికారులు తేల్చి చెప్పారు. ఈ విషయం పై పూర్తీ వివరాలను తెలుసుకుందాం..
విద్యార్థులందరికీ కేంద్రం ఉచిత ల్యాప్‌టాప్‌లను అందజేస్తోందని సోషల్ మీడియాలో ఒక టెక్స్ట్ సందేశం చెబుతోంది. ల్యాప్‌టాప్‌లు లేని విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నట్లుగా తొలగించబడిన మెసేజ్ కనిపిస్తుంది.అయితే, వైరల్ న్యూస్ ఫేక్ మరియు ప్రభుత్వం అలాంటి పథకం అమలు చేయడం లేదు. ముఖ్యంగా, అటువంటి క్లెయిమ్‌లు ప్రభుత్వమే పంచుకుంటేనే చెల్లుబాటు అవుతాయి..
భారత ప్రభుత్వం విద్యార్థులందరికీ ఉచిత ల్యాప్‌టాప్‌లను అందజేస్తోందని వెబ్‌సైట్ లింక్‌తో కూడిన టెక్స్ట్ సందేశం చక్కర్లు కొడుతోంది. సర్క్యులేట్ చేయబడిన లింక్ #Fake. ప్రభుత్వం అటువంటి పథకాన్ని అమలు చేయడం లేదు” అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెకింగ్ ఆర్మ్ ‘PIB ఫాక్ట్ చెక్’ ట్వీట్ చేసింది..అది ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది..ఇలాంటివి అమలు చేసే ముందు విద్యార్థులు చదువుతున్న కాలేజ్ లేదా స్కూల్స్ కు ముందుగానే సమాచారాన్ని అందిస్తారని మరోసారి గుర్తు చేసింది.
A message doing the rounds on Social Media regarding a Cabinet meeting held on 29 May 2022 is wrong, misleading and baseless.#PIBFactCheck
▶️ This WhatsApp forward is FAKE
▶️ No such decision or proposal is under consideration by GoI. pic.twitter.com/jD9cEosRvK— PIB Fact Check (@PIBFactCheck) June 2, 2022