మహారాష్ట్ర రాజకీయాలలో గత కొద్దీ రోజులుగా NCP లో ముసలం మొదలైంది, అధికార కాంక్షతో పన్నుతున్న కుట్రల వలన పార్టీ పరువు అంతా బజారున పడుతోంది. ఇక అజిత్ పవార్ పార్టీలోనూ ఉంటూ, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శరద్ పవార్ పౌ కీలక వ్యాఖ్యలు చేశాడు.. ఇక మీకు వయసు అయిపోయింది.. కొత్తవాళ్లకు పార్టీని ముందుకు నడిపించే అవకాశం ఇవ్వాలి అంటూ పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా ఈ వ్యాఖ్యలపై NCP చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ.. ఈ రంగంలో అయినా రాణించడానికి వయసు ఒక్కటే ముఖ్యం కాదు.. మనకు ఇచ్చిన పనిని సమర్థవంతంగా పూర్తి చెయ్యాలి అన్న దృఢ సంకల్పం మరియు మంచి పనితీరు ఉండాలి అని అజిత్ పవార్ కు కౌంటర్ ఇచ్చారు. ఇక నేను ఇప్పుడు సంవత్సరాల వయసులో ఉన్నాను… నా వయసు 92 కు వచ్చినా సరే నేను ఇదే పనితీరును చూపిస్తానని ధీమాగా చెప్పారు.