ఏపీలోని నెల్లూరులో యాసిడ్ దాడికి గురైన మైనర్ బాలికను మెరుగైన చికిత్స కోసం వైద్యులు చెన్నై అపోలో హాస్పిటల్‌కు తరలించారు. నగరంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై మేనమామే అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. బాలిక ప్రతిఘటించడంతో గొంతు కోసి, యాసిడ్ దాడికి పాల్పడ్డారు. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాలికను చికిత్స నిమిత్తం తొలుత ప్రభుత్వ హస్పిటల్‌కు.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలో హాస్పిటల్‌కు తరలించారు.
ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేపింది. వైసీపీ సర్కార్ పాలనలో అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యమౌతున్నాయని.. మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తెలుగు మహిళ నేతలు అపోలో హాస్పిటల్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. బాలిక పరిస్థితి బాగానే ఉందని చెబుతున్న అధికారులు హడావుడిగా చెన్నై తరలించాల్సిన అవసరం ఏమోచ్చిందని వారు ప్రశ్నించారు. మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నా వైసీపీ సర్కార్ ఏం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని మహిళా సంఘాలు మండిపడ్డాయి. మరోవైపు ప్రతిపక్ష నేతలు కూడా జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.