ఇదేందిరా అయ్యా..నిద్రపోతే ఐదు లక్షలు ఇస్తారా?

-

చాలామంది ఉద్యోగుల జీవితాలు నెలకు వచ్చే జీతాల మీద ఆధారపడి ఉంటుంది.నిద్రాహారాలు మాని కష్టపడితే జీతం చేతికి వస్తుంది.కానీ ఇక్కడో యువతి మాత్రం హాయిగా నిద్రపోయి లక్షలు గెలుచుకుంది.అదేలా సాధ్యం..అనే డౌట్ వస్తుంది కదా..కానీ మీరు విన్నది అక్షరాల నిజం..అంతేకాదు ‘భారత తొలి స్లీప్ ఛాంపియన్‌’ టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది. నిద్రపోతే లక్షలు గెలవడమేంటి.? ఇంతకీ ఆ పోటీ ఏంటి.? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్ మ్యాట్రస్ సంస్థ ప్రతీ ఏటా స్లీప్ ఇంటర్న్‌షిప్ అనే పోటీ నిర్వహిస్తోంది.స్లీప్ ఇంటర్న్‌షిప్ పేరుతో ప్రతి యేటా ఓ పోటీని నిర్వహిస్తుంది. ఇందుకోసం లక్షల కొద్దీ అందిన దరఖాస్తులను పరిశీలించి 15 మందిని ఇంటర్న్‌షిప్ కోసం ఎంపిక చేసింది.వీరికి ఒక పరుపుతో పాటు స్లీప్ ట్రాకర్ ఇస్తారు. వాటిని ఉపయోగించుకుని ఎవరింట్లో వాళ్లు వరుసగా వంద రోజులు, రోజుకు 9 గంటలపాటు ఎలాంటి అంతరాయం లేకుండా సుఖంగా నిద్రపోవడమే. ఇలా వాళ్ల నిద్ర నాణ్యతను పరిశీలించి నలుగుని ఫైనల్స్‌కు ఎంపిక చేస్తారు

నిద్రను ప్రోత్సహించడంలో భాగంగా వారు ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో పాల్గొనేవారు 100 రోజుల పాటు డైలీ 9 గంటల చొప్పున కంటి నిండా నిద్రపోవాలి. చివరి రౌండ్‌కు నలుగురిని ఎంపిక చేసి.. వారి నిద్ర నాణ్యతను బట్టి ఒకరిని విజేతగా ప్రకటిస్తారు.

ఈ క్రమంలోనే గతేడాది నిర్వహించిన పోటీల్లో కోల్‌కతాకు చెందిన త్రిపర్ణా చక్రవర్తి 95 శాతం స్లీప్ ఎఫిషియెన్సీ స్కోర్‌ సాధించి 5 లక్షల రూపాయలు గెలుచుకుంది. అంతేకాకుండా భారత తొలి స్లీప్ ఛాంపియన్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది. అలాగే లాస్ట్ రౌండ్‌కు వచ్చిన మిగతా ముగ్గురికి చెరో లక్ష రూపాయలు ఇచ్చారు వేక్‌ఫిట్ సంస్థ నిర్వాహకులు..వావ్ నిజంగా గమ్మత్తుగా వుంది కదా.. ఇలాంటి జాబ్స్ ప్రతి జిల్లాలో పెడితే బాగుండు అని విన్న వారంతా అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news