రాచకొండ కమిషనరేట్ ఏర్పడినప్పటి నుంచి (2016 జూన్) తొలి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేశ్ భగవత్‌కు త్వరలోనే స్థానచలనం కలగనున్నట్లు సమాచారం. గతంలో ఐపీఎస్‌ల బదిలీలు జరిగినప్పుడల్లా ఆయనకు స్థానచలనం కలుగుతుందని ప్రచారం నెలకొంది. ఈసారి మాత్రం ఆయన బదిలీ ఉంటుందని పోలీస్‌వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాచకొండ కమిషనరేట్‌కు త్వరలోనే కొత్త బాస్ రానున్నారు. సుదీర్ఘకాలంగా కమిషనర్‌గా పనిచేస్తున్న మహేశ్‌భగవత్‌కు స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. అందుకు మునుగోడు ఉపఎన్నిక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మునుగోడు శాసనసభ నియోజకవర్గంలోని చౌటుప్పల్, నారాయణపూర్ మండలాలు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఎన్నికల నియామవళి అమల్లోకి వస్తే రెండేళ్లకంటే ఎక్కువ కాలంగా పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగానే కొత్త కమిషనర్‌ను నియమించే అవకాశాలున్నాయని ఉన్నతాధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్త కమిషనర్‌గా ఎవరిని నియమిస్తారనే విషయంలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.