ఓడీఎఫ్‌ ప్లస్‌లో తెలంగాణ టాప్‌

-

ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ అనేక రంగాల్లో నంబర్ వన్​గా నిలుస్తోంది. ఇప్పటికే ఎన్నో అవార్డులు తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఓడీఎఫ్​లోనూ తెలంగాణ టాప్ స్థానంలో నిలిచింది. బహిరంగ మల విసర్జనను పూర్తిగా పరిహరించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్థాలను సక్రమంగా నిర్వహిస్తూ ఓడీఎఫ్‌(ఓపెన్‌ డెఫకేషన్‌ ఫ్రీ) ప్లస్‌ స్థాయి పొందిన టాప్‌ 5 రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లు ఉన్నట్లు కేంద్ర జల్‌శక్తిశాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ దేశంలోని 1,01,462 గ్రామాలు ఓడీఎఫ్‌ ప్లస్‌ స్థాయిని పొందగా, అందులో అత్యధిక గ్రామాలు ఈ అయిదు రాష్ట్రాల్లో ఉన్నట్లు తెలిపింది.

గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం ఇళ్లకు తాగునీరు అందించే టాప్‌-3 రాష్ట్రాల్లోనూ తెలంగాణ నిలిచినట్లు కేంద్ర జల్‌శక్తిశాఖ పేర్కొంది. రాష్ట్రాలపరంగా చూస్తే.. గోవా, తెలంగాణ, హరియాణ, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. పుదుచ్చేరి, దాద్రానగర్‌హవేలీ దయ్యూదామన్‌, అండమాన్‌నికోబార్‌ దీవులు 100% ఇళ్లకు నల్లా నీరు అందిస్తున్నట్లు వెల్లడించింది.

దేశవ్యాప్తంగా 117 ఆకాంక్షిత(వెనుకబడిన) జిల్లాల్లో తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, పంజాబ్‌లోని మోగా, హరియాణాలోని మేవాట్‌, హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలు 100% గ్రామీణ కుటుంబాలకు నల్లా నీరు అందిస్తున్నట్లు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news