ఐటీ కొత్త నిబంధనలపై వాట్సాప్ వాదన ప్రభుత్వ ధిక్కరణ చర్య.. MeitY

-

భారతదేశం తీసుకువచ్చిన ఐటీ నిబంధనలను తిరస్కరించడం ప్రభుత్వ ధిక్కరణ చర్యగా మినిస్టీ ఆప్జ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) అభిప్రాయపడింది. గోప్యత హక్కును తాము గౌరవిస్తున్నామని, ఈ హక్కులకి కూడా పరిమితులు ఉన్నాయని, సహేతుకమైన నిబంధనలు గోప్యత హక్కుకు కూడా వర్తిస్తాయని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టులో వాట్సాప్ వేసిన వాదనపై ప్రభుత్వం ఐటీ మంత్రిత్వ శాఖ కామెంట్లు చేసింది. ఇంకా, గోప్యతా హక్కుని ప్రతీ ఒక్క పౌరుడి పొందాల్సిందేనని, అదే సమయంలో జాతీయ భద్రతా విధానానికి ఎలాంటి విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని గుర్తు చేసింది.

భారతదేశం ప్రతిపాదించిన సరికొత్త ఐటీ విధానాల వల్ల సాధారణంగా వాట్సాప్ వాడేవారిపై ఎలాంటి ప్రభావం ఉండదని, అసలు వారి గోప్యతపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ మీద జరిగిన చర్చల ప్రకారం వాట్సాప్ వాదన ఎలా ఉందంటే, గుర్తించదగిన సందేశాన్ని కనుక్కోవడం వల్ల ఎండ్ టు ఎండ్ ఇన్క్రిప్షన్ సాంకేతికతకి భంగం కలుగుతుందని అది, కంపెనీ ప్రమాణాలకి విరుద్ధమని తెలిపింది.

భారతదేశం రిలీజ్ చేసిన ఒకానొక నోటీసులో గోప్యతా హక్కు అనేది ప్రతీ ఒక్కరికీ కావాల్సింది. ఇది ప్రతీ ఒక్క పౌరుడుకి వర్తిస్తుంది. ఇది ప్రాథమిక హక్కు కిందే లెక్క. చట్టం ప్రకారం ప్రాథమిక హక్కులకు కూడా సహేతుకమైన నిబంధనలు ఉంటాయని సూచించింది.

వాట్సాప్ వేసిన పిటిషన్ లో 2017లోని జస్టిస్ కె పుట్టస్వామి కేసుని ఉదహరించింది. దీని ప్రకారం ట్రేస్ చేసే విధానం అనేది రాజ్యాంగ విరుద్ధం. అది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్టే అవుతుందని ఉదాహరణగా చూపింది.

ఇండియా రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ లో ఫేస్ బుక్ తో వాట్సాప్ వ్యాపారాల నిమిత్తమై కొత్తగా తీసుకువచ్చిన విధానాలను ముందు పెట్టింది. భారతదేశ సార్వభౌమత్వానికి ఇబ్బంది కలగజేసే ఫేక్ న్యూస్ ని చెక్ పెట్టేందుకు ఇండియా తీసుకువచ్చిన కొత్త నిబంధనలు వాట్సాప్ అంగీకరిస్తే అది చాలా రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news