లోన్ తీసుకునే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్… ఒకటో తేదీ నుండి కొత్త రూల్స్..!

-

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ ని తీసుకు వచ్చింది. మైక్రోఫైనాన్స్ లెండింగ్‌కు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది రిజర్వ్ బ్యాంక్. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రోఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ వంటి వాటికి అన్నింటికీ ఇక నుండి ఒకే రూల్స్ వర్తిస్తాయి. దీని వలన రుణ గ్రహీతలకు ప్రాఫిట్ గా ఉంటుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

లోన్ తీసుకుంటే అవసరాలకు అనుగుణంగా మైక్రోఫైనాన్స్ కంపెనీలు సులభమైన రీపేమెంట్ ఆప్షన్స్ కలిగి ఉండాలి అందుకనే మైక్రోఫైనాన్స్ కంపెనీలు బోర్డు ఆమోదించిన విధానాన్ని కలిగి ఉండాలని ఆర్‌బీఐ అంది.

అదే విధంగా కస్టమర్స్ యొక్క ఇన్కమ్ ని అంచనా వేయడానికి కూడా బోర్డు ఆమోదించిన విధానాన్ని కలిగి ఉండాలని అంది. ఇది ఇలా ఉంటే ఇది వరకు ఒక వ్యక్తికి రుణాలు ఇచ్చే సంస్థల విషయంలో పరిమితి ఉండేది కానీ ఇప్పుడు అదేమీ లేదు. అలానే మంత్లీ ఆదాయంలో 50 శాతానికి లోపు ఈఎంఐ చెల్లింపు సామర్థ్యం ఉన్న వారికి లోన్ మంజూరు చేయొచ్చు.

అన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణగ్రహీతల ఆదాయ వ్యత్యాసానికి కారణాలు కనుక ఉన్నట్టయితే తెలపాలి. మైక్రోఫైనాన్స్ రుణాల పై ఎలాంటి ప్రీ-పేమెంట్ పెనాల్టీ ఉండదని చెప్పింది. ఒకవేళ కనుక ఈఎంఐ చెల్లించకపోతే అప్పుడు పెనాల్టీ పడుతుంది. ఈ పెనాల్టీ ఔట్‌స్టాండింగ్ అమౌంట్‌పై ఉండాలి కానీ లోన్ అమౌంట్ పై కాదు.

ఈ కొత్త రూల్స్ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ఆర్‌బీఐ ప్రెసింగ్ క్యాప్ కూడా తొలగించింది. అంటే మైక్రో ఫైనాన్స్ లోన్స్‌పై వడ్డీ రేటు నిర్ణయించుకునే అధికారం సంస్థలకు వుంది. గతంలో ఇన్‌స్టిట్యూషన్స్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్‌కు 10 నుంచి 12 పర్సంటేజ్ పాయింట్లకు పైన వడ్డీ రేటును నిర్ణయం తీసుకునే విధంగా రూల్స్ ఉండేవి. లేదంటే టాప్ 5 కమర్షియల్ బ్యాంకుల సగటు బేస్ రేటుకు 2.75 రెట్లు ఎక్కువగా వడ్డీ రేటును నిర్ణయం తీసుకోచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version