కొత్తరకం సైబర్‌ మోసం.. రూ. 2 వేల కరెంట్ బిల్లకు రూ. 8 లక్షలు పోగొట్టుకున్న హైదరాబాదీ..!

-

సైబర్‌ క్రైమ్స్‌ భారిన పడకుండా అధికారులు ప్రజలు నానారకాలుగా అప్రమత్తం చేస్తున్నారు. అయినా కేటుగాళ్లు కొత్తదారులు వెతుక్కుంటూ అమాయకులు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇప్పటి వరకూ బ్యాంకు ఖాతాలు, క్రెడిట్‌ కార్డులు, క్యూర్‌ కోర్డులు అనేవాళ్లు..ఈసారి ఏకంగా కరెంట్‌ బిల్లులకే టెండర్‌ వేశారు. సైబర్‌ మోసాలకు కరెంట్‌ బిల్లలను ఎంచుకున్నారు. వీరి ఎరలో చిక్కిన ఓ అమాయకుడు.. రూ. 2 వేల కరెంట్‌ బిల్లు కోసం రూ. 8లక్షలు పోగొట్టుకున్నాడు. అసలేం చేశారు..మోసం ఎలా జరిగింది..?
పెండింగ్‌ బిల్లుల క్లియరెన్స్‌ పేరుతో ఓ సైబర్‌ మోసగాడు చేసిన ఘనకార్యం తెలుసుకోవాల్సిందే. మీకు మీ పెండింగ్ క‌రెంట్ బిల్లులు క్లియర్‌ చేస్తామని చెప్పి ఈ కేటుగాళ్లు ఎలక్ట్రిసిటీ బోర్డ్‌ ఉద్యోగిగా నటిస్తూ మిమ్మ‌ల్ని సంప్ర‌దిస్తారు. అలా సంప్ర‌దించి మీ క‌రెంట్ బిల్లు మేమే క‌డ‌తాం మీరు కేవ‌లం మేము చెప్ప‌ని యాప్ మీ ఫోన్‌లో అప్‌లోడ్ చేసుకుంటే చాలని నమ్మబలుకుతారు. వాళ్ల‌ని న‌మ్మి మీరు ఈ యాప్ మీ ఫోన్ లో వేసుకున్నారో ఇక అంతే మీ అకౌంట్ మొత్తం ఖాళీ అవ‌డం ఖాయం.
సైబర్‌ నేరగాళ్ల న్యూ టెక్నిక్..
హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి కేవలం రెండు వేల రూపాయిల కరెంట్ బిల్లు కోసం సుమారు 8 ల‌క్ష‌ల రూపాయిలు పోగొట్టుకున్నాడు. అసలు ఈ తరహా మోసం ఎలా జరిగిందంటే.. సైబ‌ర్ నేరాగాళ్లు మ‌న మొబైల్ ఫోన్‌కు SMS లేదా వాట్సాప్ ద్వారా మెసెజ్ పంపింస్తాడు. ఆ మెసేజ్‌లకు స్పందించిన బాధితుల‌ను ల‌క్ష్యంగా చేసుకొని తమను తాము ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగులుగా పరిచయం చేసుకుని మీరు కరెంటు బిల్లులు చెల్లించలేదు అందుకే మీకు కరెంట్ సప్లై నిలిపివేస్తోన్నామని పోన్ కట్ చేస్తారు.
యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్నారంటే..అస్సామే..!
ఇది జరిగిన కొన్ని నిమిషాలకే మ‌ళ్లీ అదే వ్య‌క్తి మీకు ఫోన్ చేసి ఇప్పుడే చెక్ చేశాం క్రింద‌టి నెల యూనిట్ అడ్జెస్ట్‌మెంట్ ఉంది. మీరు మేము చెప్పిన యాప్‌ని సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఒక 30 రూపాయిలు చెల్లిస్తే చాలు మీరు ఈ నెల ప‌వ‌ర్‌ బిల్ క‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతారు. దీంతో సాదార‌ణంలో ప‌వ‌ర్‌ కట్ అవుతుంద‌నే ఆందోళ‌న‌లో మ‌నం క‌నీసం చెక్ చేసుకోకుండానే.. వాళ్లు పంపించిన లింక్‌లోని యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని వాళ్లు చెప్పినట్లుగా హైదరాబాద్‌కి చెందిన బాధితుడు డబ్బులు చెల్లించాడు. అంతే అక్కడి నుంచి ఎవరైతే 30రూపాయలు కట్టాడో అతని బ్యాంక్‌ అకౌంట్‌లోని డబ్బులు పోవడం మొదలవుతుంది… అయితే అకౌంట్‌లో పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటే ఒకే ట్రాన్సక్షన్‌లోనే డబ్బులు లాగేస్తారు. తక్కువగా ఉంటే కొద్ది కొద్దిగా డబ్బును కాళీ చేస్తున్నాట్లుగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు ప్రస్తుతం విద్యుత్‌ వినియోగదారులు నెంబర్లు సైబర్‌ నేరగాళ్లు ఎలా సేకరించారు, మోసాలను ఎలా నియంత్రించే పనిలో ఉన్నారు. ఏది ఏమైనా తెలియని వ్యక్తులు చెప్పే సోది మాటలు నమ్మొద్దు. ఫోన్‌లో నెట్‌ బ్యాలెన్స్ ఉంది కదా అని ఏది పడితే ఆ లింక్‌ అసలే ఓపెన్‌ చేయొద్దు. మీకు పరిచయం లేని వారు మీ ఫోన్లో లేదా ల్యాప్‌టాప్‌లో ఎనీడెస్క్‌, టీమ్‌వ్యూవర్‌ లాంటి యాప్‌లో వేసుకోమంటి అస్సలు చేయొద్దు. మోసం అనేది ఏ యాంగిల్‌ నుంచి అయినా జరగొచ్చు..మనం చేయాల్సిందల్లా..తెలియని వాటిని నమ్మకపోవడమే.!

Read more RELATED
Recommended to you

Latest news