టీఎస్పీఎస్సీ నుంచి ఒక కొత్త అప్ డేట్ వచ్చింది. వాటి పరీక్షల తేదీలను ప్రకటిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసింది. కొత్తగా పరీక్షల తేదీలు ప్రకటించిన వాటిలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇనస్పెక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్, వాటర్ డిపార్ట్ మెంట్ లోని గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ పోస్టులు, డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ వంటి వాటికి కొత్త తేదీలను ప్రకటించారు. కొత్త తేదీలు ఇలా ఉన్నాయి. ఏఎంవీఐ పోస్టులకు మొదట ఏప్రిల్ 23న పరీక్ష తేదీని ప్రకటించారు. దీనిని జూన్ 26కు వాయిదా వేశారు. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి పరీక్ష తేదీని మొదట ఏప్రిల్ 25న ప్రకటించగా.. తాజాగా దీనిని మే 16 నిర్వహించనున్నట్లు ప్రకటించారు. వాటర్ బోర్డులో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు మొదట మే 15, 16న పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించగా.. ఇప్పుడు దానిని జులై 20, జులై 21కు వాయిదా వేశారు.
ఇక దీనిలోనే గెజిటెడ్ ఉద్యోగాలకు మొదట ఏప్రిల్ 26, 27 తేదీలు ప్రకటించగా.. తాజాగా దీనిని జులై 18, 19కు వాయిదా వేయడం జరిగింది. డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు సంబంధించి పరీక్ష తేదీని మొదట మే 07వ తేదీ ప్రకటించగా.. తాజాగా దీనిని మే 19 నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటిలో గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ లోని గెజిటెడ్ ఉద్యోగాలకు, ఏఎంవీఐ, అగ్రికల్చర్ ఆఫీసర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ లోని నాన్ గెజిటెడ్, డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు ఆన్ లైన్ విధానం(కంప్యూటర్ బేస్డ్)లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలియచేశారు.