ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్ లక్నో వేదికగా జరుగుతుంది. రాత్రి 7గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి టీ20 మ్యాచ్‌లో ఓటమిపాలైన హార్దిక్ సేనకు రెండో టీ20 మ్యాచ్‌లో తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి. అయితే, ఈ మ్యాచ్‌కు తుది జట్టులో రెండుమార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంది. తొలి టీ20లో ఓటమిపాలైన టీమిండియా రెండో మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగింది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
టీ20 కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టాక ఒక్క సిరీస్ కూడా భారత్ ఓడిపోలేదు. ఈ నేపథ్యంలో రెండో టీ20లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఆడుతోంది. మరోవైపు వన్డే సిరీస్ చేజార్చుకున్న న్యూజిలాండ్ టీ20 సిరీస్ అయినా గెలవాలని ప్లాన్ పట్టుదలతో ఉంది. రెండో మ్యాచులోనూ రోహిత్ సేనను ఓడించి ట్రోఫీ ఎగరేసుకుపోవాలని ఆడుతోంది.
టీమిండియా తుది జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, చాహల్ , అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్ తుది జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్ , మైఖేల్ బ్రేస్‌వెల్, జాకబ్ డఫీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్.