‘చంద్రముఖి-2’లో స్మైలింగ్ క్వీన్ త్రిష?

-

స్టైల్ కింగ్, తమిళ్ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘చంద్రముఖి’..ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ విదితమే. ఈ ఫిల్మ్ కు సీక్వెల్ ను తీయబోతున్నట్లు ఇటీవల ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేసింది.

సీక్వెల్ కు కూడా పి.వాసుయే దర్శకత్వం వహిస్తారని తెలుపుతూ పోస్టర్ రివీల్ చేసింది. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తారని పేర్కొన్నారు మేకర్స్. కాగా, ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసేది ఎవరు అనేది కీలకంగా మారింది. ఎందుకంటే ‘చంద్రముఖి’ సినిమా మాదిరిగానే సీక్వెల్ లోనూ ప్రధాన హీరోయిన్ పాత్ర చాలా కీలకం. ఈ నేపథ్యంలోనే ఆ పాత్రకు స్మైలింగ్ క్వీన్ త్రిషను సెలక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.

‘చంద్రముఖి’ సినిమాలో జ్యోతిక భయపెట్టిన మాదిరిగానే త్రిష కూడా సీక్వెల్ లో భయపెట్టగలదా? అని ఈ సందర్భంగా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే, త్రిష ఈ ప్రాజెక్టులో జాయిన్ అయిందా? అనే విషయమై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. త్వరలో ప్రకటన వచ్చే చాన్స్ ఉందని కోలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version