బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ..మహేశ్ బాబు కోసం త్రివిక్రమ్ వెయిటింగ్!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హ్యాట్రిక్ ఫిల్మ్ చేయబోతున్నారు. SSMB28పైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అతడు, ఖలేజా’ తర్వాత వీరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపైన ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

మహేశ్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ లో ఉన్నాడు. కాగా, మహేశ్ ఇండియాకు వచ్చే సరికి ఆల్రెడీ ఉన్న స్టోరి లైన్ ను కంప్లీట్ చేసి బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశారని తెలుస్తోంది. ఈ విషయమై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్..ఏకంగా జర్మనీకి వెళ్లి మహేశ్ కు స్టోరి కంప్లీట్ గా వినిపించారట.

జూలైలో ఈ ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలోనే స్టోరిలో మహేశ్ కు ఉన్న డౌట్స్ అన్నిటినీ దర్శకుడు క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. నాలుగు నెలల్లోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో కథానాయిగా త్రివిక్రమ్ ఆస్థాన నాయిక టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news