SSMB28 టైటిల్ ఫిక్స్..సెంటిమెంట్ ఫాలో అవుతున్న మహేశ్-త్రివిక్రమ్!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ పిక్చర్ రికార్డుల వేటలో తలమునకలైంది. కాగా, మహేశ్ తన నెక్స్ట్ ఫిల్మ్స్ పైన ఫోకస్ పెడుతున్నాడు. తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా SSMB28 త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా చిత్రానికి సంబంధించిన అప్ డేట్ రివీల్ చేస్తారని తెలుస్తోంది. కాగా, ఆ చిత్ర టైటిల్ ‘అర్జునుడు’ అని ఫిక్స్ చేసినట్లు టాక్.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు ‘అ’ అక్షరం సెంటిమెంట్ కాగా, మహేశ్ నటించిన ‘అర్జున్’ మూవీ కూడా హిట్ అయిన నేపథ్యంలో ఆ టైటిల్ కు మహేశ్ ఓకే చెప్పినట్లు వినికిడి. చూడాలి మరి.. ఈ వార్తల్లో నిజం ఎంతుందో..మహేశ్ ఈ చిత్రం తర్వాత దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో పిక్చర్ చేయనున్నారు. మహేశ్ వరుస సినిమాలు బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతున్నాయి. ‘‘భరత్ అనే నేను’’,‘‘మహర్షి’’, ‘‘సరిలేరు నీకెవ్వరు’’ తర్వాత ఇటీవల విడుదలైన ‘‘సర్కారు వారి పాట’’ సూపర్ హిట్ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version