ప్రపంచకప్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్ గెలుపు

సౌతాంప్టన్: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్స్‌షిప్ విజేతగా న్యూజిలాండ్ నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌పై అలవోకగా గెలిచింది. రెండో ఇన్నింగ్స్ భారత్ 170 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 32 పరుగుల అధిక్యంలో ఉంది. దీంతో భారత్ రెండో ఇన్సింగ్స్‌లో ఇచ్చిన 139 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలిచింది. 45.5 ఓవర్లలోనే కేన్ విలియమ్సన్ జట్టు టెస్్ట ప్రపంచకప్‌ను చేజిక్కించుకుంది. 2000లో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన న్యూజిలాండ్‌ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ ఐసీసీ టోర్నీలో విజేతగా నిలిచింది. అప్పుడు కూడా భారత్‌నే న్యూజిలాండ్ ఓడించింది. 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 217; న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 249

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ 30; గిల్‌ 8; పుజారా 15; కోహ్లి 13; రహానే 15; పంత్‌ 41; జడేజా 16; అశ్విన్‌ 7; షమీ 13; ఇషాంత్‌ (నాటౌట్‌) 1.

న్యూజిలాండ్ బౌలింగ్‌: సౌతీ (4) వికెట్లు, బౌల్ట్‌ (3), జేమీసన్‌ (2), వాగ్నర్‌ (1)

న్యూజిలాండ్‌ సెకండ్ ఇన్నింగ్స్‌: లాథమ్‌ 9; కాన్వే 19; విలియమ్సన్‌ (నాటౌట్‌) 52; రాస్‌ టేలర్‌ (నాటౌట్‌) 47.

భారత్ బౌలింగ్‌: అశ్విన్‌ 2 వికెట్లు