గిన్నిస్ వరల్డ్ రికార్డులో NHAI.. అరుదైన రికార్డు సాధించిన మోడీ ప్రభుత్వం

-

మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా మరో అరుదైన రికార్డును సృష్టించింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) ఒకే వరుసలో 75 కిలో మీటర్ల పొడువైన రహదారిని నిర్మించింది. ఈ అరుదైన రికార్డు సాధించినందుకు ‘గిన్నిస్ వరల్డ్ రికార్డు’లో పేరు నమోదైంది. ఈ జాతీయ రహదారిని కేంద్రం కేవలం 5 రోజుల్లో పూర్తి చేయడం విశేషం.

నేషనల్ హైవే
నేషనల్ హైవే

గతంలో ఈ రికార్డ్ ఖతార్ పేరిట నమోదైంది. ఆ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్‌లో బుధవారం వెల్లడించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్‌తో పాటు.. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఈ నేషనల్ హైవే అమరావతి-అకోలా మధ్య ఉంది. సుమారు 75 కి.మీ. పొడవైన ఈ రహదారిని 105 గంటల 33 నిమిషాలలో నిర్మించారు. దాదాపు 800 మంది ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బంది, 720 మంది కార్మికులు పని చేశారు.

https://twitter.com/nitin_gadkari/status/1534241489508704256?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1534241489508704256%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fnational%2Fpm-modi-govt-at-8-years-nhai-built-75km-nh-road-in-record-time-enters-guinness-world-record-au60-724831.html

ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ప్రపంచ గర్వించే స్థాయికి భారత్ రికార్డు సృష్టించిందన్నారు. ఎన్‌హెచ్‌ఏఐ, కన్సల్టెంట్స్, రాజ్‌పత్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిట్, జగదీష్ కదమ్ సంస్థలు ఎంతో శ్రమించాయన్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా శ్రమించిన ఇంజినీర్లు, కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news