మహారాష్ట్ర రాజధాని ముంబాయిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో బృహన్ ముంబై మున్సిపల్ కర్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న నైట్ కర్ఫ్యూ ను పూర్తిగా ఎత్తివేశారు. కాగ కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రతో పాటు ముంబై నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా వెలుగు చూశాయి. ఒక్కొ రోజు దాదాపు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ముంబై నగరంలో నైట్ కర్ఫ్యూ విధించి మరి కొన్ని ఆంక్షలను విధించారు.
అయితే ప్రస్తుతం ముంబైలో కరోనా వ్యాప్తి గణనీయంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ ఎత్తేశారు. అలాగే ఆంక్షలనపు సడలించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో నేటి నుంచి నగరంలో ఉండే రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, థీమ్ పార్క్ లకు అనుమతి ఇచ్చారు. కానీ 50 శాతంతో సామర్థ్యంతోనే నడిపించాలని నిబంధనను పెట్టారు. అలాగే బీచ్ లతో పాటు పార్కులు, పర్యాటక ప్రాంతాలను గతంలో లాగే తెరుచుకోనున్నాయి.