వడగాలులు, ఎండలు లేవు… వర్షాలు పడుతాయి: వాతావరణ శాఖ

-

వేసవి నుంచి దేశప్రజలకు ఉపశమనం లభిస్తుందని ఐఎండీ తెలిపింది. రెండు రాష్ట్రాల్లో మినహా.. దేశమంతా హీట్ వేవ్ కాస్త తగ్గుముఖం పడుతుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతం నుంచి తేమ పెరగడంతో.. ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. వడగాలుల కాలం దాదాపు ముగిసినట్లేనని, ఇక కొన్ని రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది.

పశ్చిమ రాజస్థాన్, కేరళ మినహా దేశమంతా వేడిగాలులు తగ్గుతాయని ఐఎండీ శాస్త్రవేత్త సోమా సేన్ వెల్లడించారు. హీట్ వేవ్ తగ్గినప్పటికీ.. వర్షాలు అధికంగా ఉంటాయో లేదో అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలలో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవవచ్చని అన్నారు. ఉత్తరాఖండ్,బిహార్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు.. అస్సాం, మేఘాలయ సమీప రాష్ట్రాల్లోనూ పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపారు.తెలంగాణలో 2 రోజులపాటు ( మే 11 నుంచి) వర్షాలు కురిసే అవకాశం ఉందని ,పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version