షాకింగ్:సూపర్ హిట్ కొట్టిన దర్శకుడికి సినిమా లేదు.!

-

సినిమా పరిశ్రమలో పని చేసే వారికి టాలెంట్ తో పాటు చొరవ,అదృష్టం కూడా వుండాలి. వీటితో పాటు ముందు చూపు చొరవ వుండడం చాలా అవసరం. ఎందుకంటే ఒక సినిమా సెట్స్ మీద వుండగానే ఇంకో సినిమా సెట్ చేసుకొని రెడీ గా వుండాలి. లేకుంటే ఇంకో సినిమా చేయటానికి చాలా గ్యాప్ వస్తుంది. ఆ డైరెక్టర్ ఎంత పెద్ద హిట్ ఇచ్చినా కూడా చివరికి హిట్ వేడి వెంటనే చల్లారి పోతుంది.

అందుకే మన స్టార్ హీరోలు, డైరెక్టర్ లు వరసగా సినిమాలు ఒప్పుకుంటూ కనీసం రెండు సంవత్సారాల వరకు తిరుగులేకుండా చూసుకుంటారు.కాని ప్రస్తుతం టాలీవుడ్లో ఒక డైరెక్టర్ పరిస్థితి చాలా ఇబ్బంది కరంగా వుంది. ఆ దర్శకుడే ‘సీతారామం’తో సూపర్ హిట్ కొట్టిన హను రాఘవ పూడి . ఆ సినిమా అందరినీ మేస్మరైజ్ చేసింది. దీంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని ప్రస్తుతం టాలీవుడ్లో అందరూ చాలా బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం టాలీవుడ్లో పెద్ద హీరోలకు కధలు చెబుతున్నాడు. కాని ఇప్పటికిప్పుడు డేట్స్ ఇవ్వడానికి రెడీ గా లేరు. ప్రస్తుతం స్టార్స్  అంతా బహుళ ప్రాజెక్ట్ లతో  బిజీగా ఉన్నారు. తెలుగు సినిమా స్టార్స్ అంతా పాన్ ఇండియా జపం చేస్తూ ఉన్నారు. రెండేళ్ల వరకూ ఏ హీరో డేట్లు దొరికే పరిస్థితి లేదు. అయినా కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు తన ప్రయత్నాలు ఫలించి మంచి సినిమా చేయాలని మనసారా కోరుకుందాం

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version