విషాదం : మహిళ ప్రాణం తీసిన టాయ్‌ ట్రైన్‌

కొన్ని కొన్ని సార్లు వినోదాన్ని ఇచ్చే వస్తువులే యమ పాశాలుగా మారుతుంటాయి. అలాంటి ఘటనే ఇది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ నగరంలో ప్రమాదం జరిగింది. టాయ్ ట్రైన్ బోగీలో ఇరుక్కుపోయి ఓ మహిళ చనిపోయింది. మంజూ శర్మ అనే మహిళ ఫ్యామిలీతో కలిసి సరదాగా జూకి వెళ్లింది. జూలో టాయ్ ట్రైన్ ఎక్కిన మంజూశర్మ ప్రమాదవశాత్తూ ట్రైన్ బోగీలో చిక్కుకుంది. పక్కనున్న వారు గుర్తించి కేకలు వేసి ట్రైన్ నిలిపేశారు. తీవ్రంగా గాయపడిన మంజుశర్మ అనే మహిళ మృతి చెందింది.

Kanpur Zoo Accident: प्लेटफार्म पर लगा CCTV कैमरा निकला खराब, खुली  अव्यवस्थाओं की पोल, पहले भी हुए है कई हादसे - Kanpur Zoo Accident woman  dead in Zoo due to come under

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జూ సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దానిపై ఆరా తీశారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని నడిపే టాయ్ ట్రైన్ లో ప్రమాదం జరగడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు తెలిపారు పోలీసులు. అయితే.. ఇదిలా ఉంటే.. ప్రమాదం జరిగిన సంఘటన స్థలంలో ఉన్న స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడూ చిన్నపిల్లల బోసినవ్వులతో నిండిపోయే జూలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.