తెలంగాణ ప్రభుత్వ టీచర్లకు షాక్..15 వ తేదీ దాటినా అందని జీతాలు !

-

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు ఊహించని షాక్‌ తగిలింది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ పరిధిలోని ఆదర్శ పాఠశాలలు, సమగ్ర శిక్షా అభియాన్‌ కు చెందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఇప్పటికీ.. మార్చి మాసం జీతాలు అందలేదు. ఏప్రిల్‌ 15 వ తేదీన దాటినప్పటికీ.. జీతాలు రాకపోవడంతో.. సుమారు 25 వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 194 ఆదర్శ పాఠశాలల్లో దాదాపు 5 వేల మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 3 వేల మంది వరకు శాశ్వత ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రతి నెలా 1 వ తేదీకి అందాల్సిన జీతాలు ఇప్పటి వ రకూ మంజూ రవడం లేదని ఆదర్శ పాఠశాలల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతన బిల్లును తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదించకపోవడం కారణంగానే.. ఈ జాప్యం జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈఎంఐలు కట్టుకునే సమయంలో జీతాలు రాకపోవడం.. ఉద్యోగుల పట్ల శాపంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version