తెలంగాణ కాంగ్రెస్ మెగా లీడర్ లకు అధిష్టానం మొండి చెయ్యి ?

-

తెలంగాణ సార్వత్రిక ఎన్నికలకు ఇంకా కొద్దీ సమయం మాత్రమే ఉంది.. రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా అధికారం కోసం దగ్గర ఉన్న అన్ని మార్గాలను వాడుకుంటూ గెలుపు దిశగా పయణిస్తున్నాయి. కాగా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే మరియు ఎంపీ టికెట్ లను ఆశించే వారి కోసం ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అందుకోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని టికెట్ లను మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయగా, ఇంకా చాలా టికెట్ ల విషయంలో క్లారిటీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ టికెట్ లను ఆశిస్తున్న వారిలో 1000 మంది అప్లై చేసుకున్నారు. కానీ పార్టీలో కొందరు నేతలు మాత్రమే కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి ఆసక్తిని చూపించకపోవడం గమనార్హం. అయితే వీరికి కాంగ్రెస్ అధిష్ఠానము నుండి ఆదరణ తగ్గిందా అంటే … రాజకీయ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

వీరిలో గీతారెడ్డి, జానారెడ్డి, వి హెచ్ హనుమంతరావు, రేణుక చౌదరి , నిరంజన్ మరియు కోందండ రెడ్డి లు ఉన్నారు. మరి వీరి సేవలను కాంగ్రెస్ అధిష్ఠానము వచ్చే ఎన్నికల ముంగిట వాడుకోనుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version