మేడిపల్లి సాయి డిఫెన్స్ అకాడమీకి నోటీసులు జారీ.. ఎందుకంటే?

‘అగ్నిపథ్’ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కూడా భారీ ఎత్తున అల్లర్లు, నిరసనలు జరిగాయి. అయితే ఈ అల్లర్ల కేసులో మేడిపల్లిలోని సాయి డిఫెన్స్ అకాడమీకి రైల్వే పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆర్మీకి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులను రెచ్చగొట్టారనే ఆరోపణలో రైల్వే యాక్ట్-1989 ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

సాయి డిఫెన్స్ అకాడమీ
సాయి డిఫెన్స్ అకాడమీ

ఈ మేరకు ఆ నోటీసులను సాయి డిఫెన్స్ కార్యాలయం గేటుకు అతికించారు. త్వరలో విచారణ ఉంటుందని, విచారణకు సాయి డిఫెన్స్ అకాడమీ రికార్డులు, ఆధార పత్రాలతో రావాలని రైల్వే పోలీసులు సూచించారు. కాగా, ఈ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి.. అక్కడి నుంచి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.