రాజీవ్ స్వగృహా ప్లాట్ల కేటాయింపునకు మరోసారి గడువును పెంచామని హెచ్‌ఎండీఏ అధికారులు వెల్లడించారు. అసలు విషయంలోకి వెళ్లితే…. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లో ఉన్న రాజీవ్ స్వగృహా ప్లాట్ల కేటాయింపునకు మరోసా గడువు పెంచామని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువు పెంచామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులు టోకెన్ అడ్వాన్స్ బీహెచ్‌కె ఫ్లాట్ కోసం రూ.2 లక్షలు, 1 బీహెచ్‌కె ఫ్లాట్ కోసం రూ. 1 లక్షలను డిమాండ్ డ్రాప్ట్ (డీడీ) రూపంలో మెట్రో పాలిటన్ కమిషనర్, హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ పేరుతో చెల్లుబాటు అయ్యేలా డీడీలు తీసుకోవాలని తెలిపారు.
డీడీలను హిమాయత్ నగర్‌లోని స్ట్రీట్ నంబర్ 17, ఉర్దూ గల్లీలోని తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో అందజేయాలని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. వచ్చిన దరఖాస్తుల నుంచి లాటరీ ద్వారా ఫ్లాట్‌లను కేటాయిస్తామని పేర్కొన్నారు.