గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా భారీ త‌గ్గింపు ధ‌ర‌కు ల‌భిస్తున్న ఐఫోన్ 12.. వెంట‌నే సొంతం చేసుకోండి..!

-

దేశంలోని అతి పెద్ద ఈ-కామ‌ర్స్ సంస్థ‌లైన ఫ్లిప్ కార్ట్‌, అమెజాన్ లు ప్ర‌స్తుతం ప్ర‌త్యేక సేల్‌ల‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం విదిత‌మే. ఈ సేల్‌ల‌లో యాపిల్ త‌న‌ ఉత్పత్తుల‌ను భారీ తగ్గింపు ధ‌ర‌ల‌కు అందిస్తోంది. అమెజాన్ తన ప్రైమ్ డే సేల్‌ను జూలై 26, 27 తేదీల్లో నిర్వహిస్తుండగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ జూలై 25 నుండి ప్రారంభ‌మైంది. ఈ సేల్ జూలై 29 వరకు కొన‌సాగ‌నుంది. ఈ రెండు సేల్‌ల‌లోనూ యాపిల్‌కు చెందిన ఐఫోన్ 12 ( Iphone 12 ) ఫోన్‌ల‌ను భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

యాపిల్ ఐఫోన్ 12

యాపిల్ ఐఫోన్ 12కు చెందిన‌ 64 జీబీ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్ర‌స్తుతం గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా అతి తక్కువ ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 2020లో యాపిల్ లాంచ్ చేయ‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ ఫోన్‌కు యూజ‌ర్ల నుంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇక ఈ ఫోన్ ధ‌ర రూ. 79,990 ఉండ‌గా రూ.12,000 డిస్కౌంట్ ధరను అందిస్తున్నారు. దీంతో 64 జీబీ మోడ‌ల్ రూ.67,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది. ఇక ఐఫోన్ 12కు చెందిన‌ 128 జీబీ వేరియంట్ ధ‌ర‌ రూ.72.999 గా ఉంది. రెండు మోడళ్లకు గతంలో ఎన్న‌డూ ఇంతటి భారీ తగ్గింపు ధ‌ర‌ లభించలేదు.

యాపిల్ ఐఫోన్ 12 ఫోన్ లో.. 6.1 ఇంచుల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, ఎ14 బయోనిక్ చిప్‌, రెండు 12 మెగాపిక్స‌ల్ కెమెరాలు, ముందు భాగంలో 12 మెగాపిక్స‌ల్ కెమెరా.. వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.

ఇక మోటోరోలాకు చెందిన ఫోల్డ‌బుల్ ఫోన్ మోటో రేజ‌ర్ ధ‌ర రూ.95వేలు ఉండ‌గా ధ‌ర‌ను త‌గ్గించి రూ.54,999 కు విక్ర‌యిస్తున్నారు. అలాగే భారీ తగ్గింపుతో ల‌భిస్తున్న‌ ఇతర స్మార్ట్‌ఫోన్‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

* యాపిల్ ఐఫోన్ 12 మినీ (64 జీబీ): రూ. 57,999
* యాపిల్ ఐఫోన్ SE 2020 (64 జీబీ): రూ. 28,999
* యాపిల్ ఐఫోన్ ఎక్స్‌ఆర్ (64 జీబీ): రూ. 37,999
* శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 (128 జీబీ): రూ. 17,999
* ఆర్‌వోజీ ఫోన్ 3 (128 జీబీ): రూ. 39,999

Read more RELATED
Recommended to you

Exit mobile version