ఇక రామ్ చరణ్‌కు ప్రెషర్ స్టార్ట్.. రిలీఫ్ మోడ్‌లో తారక్‌..!

-

ఏళ్లుగా వెయిట్ చేసిన ఆ చిత్రం రానే వచ్చింది. ప్రేక్షకుల నీరాజనాలు అందుకుని రికార్డుల వేటకు బయలుదేరింది. అదే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. టాలీవుడ్ జక్కన్న తెరకెక్కించిన ఆ కళా ఖండం చూసి సినీ లవర్స్, సెలబ్రిటీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళికి హ్యాట్సాఫ్ చెప్తున్నారు. ఈ ఫిల్మ్‌లో లీడ్ రోల్స్ ప్లే చేసిన రామ్ చరణ్, తారక్ గురించి చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తన పాత్రలో చక్కటి పరిణతి కనబరిచారని కొనియాడుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ స్టోరి రైటర్ ఫిల్మ్ రిలీజ్‌కు ముందే తాను ఒక రెండు మార్కులు చరణ్‌కు ఎక్కువ వేస్తానని చెప్పారు.

విజయేంద్రప్రసాద్ చెప్పినట్లుగానే పిక్చర్‌లో రామ్ చరణ్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. పోలీసు ఆఫీసర్ , అల్లూరి సీతా రామరాజుగా రామ్ చరణ్ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పొచ్చు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రమోషన్స్‌లో రామ్ చరణ్ చాలా కూల్‌గా కనిపించారని, కానీ, సిల్వర్ స్క్రీన్ పైన ఫైర్ చూపించాడని ఈ సందర్భంగా సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తర్వాత రామ్ చరణ్‌కు ప్రెషర్ స్టార్ట్ అవుతుందనే చర్చ జరుగుతున్నది.

‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్‌ను జూనియర్ ఎన్టీఆర్ ఎంజాయ్ చేసినట్లుగా రామ్ చరణ్ ఎంజాయ్ చేయలేడని అంటున్నారు. ఎందుకంటే ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ ప్రమోషన్స్ , రిలీజ్ అయిపోయిన నేపథ్యంలో ఆయన ఇప్పుడు వెంటనే ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఆర్సీ 15’ మూవీలో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వచ్చే నెల 29న తండ్రి చిరుతో కలిసి నటించిన ‘ఆచార్య’ విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో నూ పాల్గొనాల్సి ఉంటుంది.

తారక్‌కు మాత్రం అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే తన నెక్స్ట్ మూవీ స్టార్ట్ కావడానికి ఇంకా కొంత టైం పడుతుంది. ‘ఆచార్య’ ఫిల్మ్ ప్రమోషన్స్‌లో కొరటాల శివ ఎలాగూ బిజీగా ఉంటారు. కాబట్టి ఆయన సినిమా ప్రమోషన్స్, రిలీజ్ అయ్యేంత వరకు చక్కగా తారక్ తన ఫ్యామిలీతో వేకేషన్ కు వెళ్లే చాన్సెస్ ఉంటాయి.

అలా మొత్తంగా రామ్ చరణ్ కు వర్క్ ప్రెషర్ అయితే చాలానే ఉండొచ్చని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇకపోతే రామ్ చరణ్ ‘ఆచార్య’ ప్రమోషన్స్ కంప్లీట్ చేసి ‘ఆర్సీ 15’ ఫినిష్ చేసే లోపు.. గౌతమ్ తిన్ననూరి స్పోర్ట్స్ డ్రామాతో రెడీగా ఉండొచ్చు. అలా మెగా పవర్ స్టార్ ఫుల్ బిజీగా ఉండబోతున్నారని చెప్పొచ్చు. అయితే, వరుస సినిమాల కోసం రామ్ చరణ్ వర్క్ చేస్తుండటం పట్ల మెగా అభిమానులు అయితే ఆనందమే వ్యక్తం చేస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news