జీవ వైవిధ్యం సమతూకంలో ఉండాలంటే అడవుల్లో వన్య మృగాలు ఉండాలి. అలాంటప్పుడే ఆహర గొలుసు బాగుంటుంది. కానీ కొంత మంది మాత్రం డబ్బు ఆశతో వన్య మృగాల వేలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పెద్ద పులులకు ఆవాసయోగ్యంగా ఉన్న ఇండియాలో పులుల వేట ఎక్కువగానే ఉంది. తాజాగా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీఏ నివేదికలో చేడు నిజాలు వెల్లడయ్యాయి.
దశాబ్ధ కాలంలో ఏ ఏడాది లేనట్టుగా 2021లో పులులు ఎక్కువగా మరణించాయి. ఎన్టీసీఏ నివేదిక ప్రకారం డిసెంబర్ 29,2021 వరకు దేశంలో 126 పులులు మరణించాయి. గత పదేళ్లలో ఈ సంఖ్య ఇప్పుడే అధికంగా ఉంది. 2016లో 121 పులులు మరణించాయి. అప్పటి వరకు ఇదే హైయెస్ట్ గా ఉండేది. వీటిలో 60 పులులు వేటగాళ్ల చేతిలో, పలు ప్రమాదాల్లో, మనుషుల చేతిలో మరణించాయి. పులుల సంరక్షణకు ప్రపంచ దేశాలతో పోలిస్తే మనదేశంలోనే ఆవాసయోగ్యంగా ఉన్నాయని గతేడాది ’స్టెటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా ‘ నివేదిక వెల్లడించింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఇలా పులుల మరణాలు సంభవించడం అందరిని కలవరపరుస్తోంది. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. అడవుల్లో సహజంగా మరణించే పులుల సంఖ్య అందుబాటులో లేదు.
రాష్ట్రాల వారీగా మధ్యప్రదేశ్ లోని 526 పులుల్లో 41 మరణించాయి. ఇదే విధంగా కర్ణాటకలో 524 పులుల్లో 15, యూపీలో 173 పులుల్లో 9, తెలంగాణలోని 26 పులుల్లో 4, ఏపీలో 48 పులుల్లో ఒక పులి మరణించినట్లు నివేదిక వెల్లడించింది.