సీఎం హెలిప్యాడ్ కోసం.. 300 చెట్లు నరికివేత..

-

సీఎం కేసీఆర్ ఓ పక్క హరితహారం అంటూ మొక్కలు నాటాలని సూచిస్తుంటే… మరో పక్క అధికారులు సీఎం కేసీఆర్ పేరు చెప్పి.. చెట్లను నరికివేస్తున్నారు. ఏడాదిలో ఒకటి, రెండు సార్లు కూడా వస్తారో రారో తెలియని సీఎం ‘కేసీఆర్ హెలీప్యాడ్​ కోసం నల్గొండ పట్టణంలోని 5 ఎకరాల్లో ఉన్న నీలగిరి నందనవనాన్ని అధికారులు నేలమట్టం చేశారు. దగ్గర్లో 150 ఎకరాల భూములున్నా కేవలం జిల్లా కలెక్టరేట్ పక్కనే హెలిప్యాడ్​ ఉండాలనే ఒకే ఒక్క కారణంతో సుమారు 30 ఏండ్ల నాటి 300 చెట్లు తొలగిస్తున్నారు. 3 ఎకరాల్లోని నీలగిరి నందనవనంలోని వేప, మద్ది, దిరిసెన, తదితర చెట్లు దశాబ్దాలుగా పట్టణ ప్రజలను ఆహ్లాదపరుస్తున్నాయి. కానీ కొద్దిరోజలుగా వీటితో పాటు ఈ ఆవరణలో లక్షలు ఖర్చుపెట్టి తెలంగాణ హరితహారంలో భాగంగా నాటిన మొక్కల్ని కూడా తొలగిస్తున్నారు.

హెలీప్యాడ్​ నిర్మించడానికి పట్టణ పరిసర ప్రాంతాల్లో వందల ఎకరాల్లో ఖాళీ స్థలం ఉంది. ఎస్ఎల్​బీసీ వద్ద సుమారు 150 ఎకరాలుండగా, దీంట్లో ప్రభుత్వ బిల్డింగ్స్ కు వంద ఎకరాలు కేటాయించారు. అయినా ఇందులో ఇంకా 50 ఎకరాల వరకు ఖాళీగా ఉంటుందని రెవెన్యూ ఆఫీసర్లు చెప్తున్నారు. చర్లపల్లి సమీపంలోని 12 బెటాలియన్ వద్ద ఉన్న స్థలం కూడా సరిపోతుందంటున్నారు. కానీ భద్రతా కారణాల దృష్ట్యా కలెక్టరేట్ పక్కన సీఎం హెలిప్యాడ్​ ఉంటే బాగుంటుందని, దీనివల్ల టైం కూడా కలిసొస్తుందని కలెక్టరేట్ కు కూతవేటు దూరంలోనే నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version