ఏపీలో కొత్తగా మరో 10 ఓమిక్రాన్ కేసులు… మొత్తంగా 16 కి చేరిన కేసుల సంఖ్య

-

తెలుగు రాష్ట్రాల్లో ఓమిక్రాన్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రోజురోజుకు ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 10 కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తం ఏపీలో కేసుల సంఖ్య 16కు చేరింది. దీంతో ఏపి వైద్య శాఖ అప్రమత్తం అయింది. ఇది వరకు పలు ధపాలుగా ఆరు కేసులు నమోదయ్యాయి. అయితే కేవలం ఇవాళ ఒక్క రోజే 10 కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా ఏపీ ఉలిక్కి పడింది.

ప్రస్తుతం నమోదైన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారికే సోకాయి. అయితే వీరితో పాటు సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యులకు ఓమిక్రాన్ సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నమోదైన కేసుల్లో ఈస్ట్ గోదావరిలో 3, అనంతపూర్ లో 2, కర్నూలు 2, వెస్ట్ గోదావరి లో 1, గుంటూర్ 1, చిత్తూర్ లో 1 చొప్పున ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కువైట్, నైజీరియా, దుబాయ్, సౌదీ నుంచి వచ్చిన వారికి ఓమిక్రాన్ సోకింది.

ఇప్పటికే మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో కేసుల సంఖ్య 62 కేసులు నమోదయ్యాయి. వరసగా తెలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదవ్వడంతో ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news