కరోనా కేసులు చైనాలో మళ్లీ నమోదవుతున్నాయి.. అనధికార సమాచారం ప్రకారం..చైనాలో కోవిడ్ మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దేశంలోని వైద్య వ్యవస్థ కూడా కుప్పకూలిన పరిస్థితి నెలకొన్నది. చైనాలో ఆసుపత్రుల్లో కోవిడ్ బాధితుల చేరికలు పెరగడం, ఆసుపత్రుల కారిడార్లలో మృతదేహాలను పేర్చడం, స్మశాన వాటికల వద్ద రద్దీ, అంత్యక్రియల సేవలకు అనూహ్యంగా పెరిగిన భారీ డిమాండ్.. మొదలైన వార్తలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
ఒమిక్రాన్ బీఎఫ్ 7తో మరో వేవ్?
ప్రస్తుతం చైనాలో కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరగడానికి కారణం కరోనా వైరస్ ఒమిక్రాన్ బీఎఫ్ 7(Omicron BF.7) సబ్ వేరియంట్(Omicron BF.7) అని భావిస్తున్నారు. భారత్‌లోనూ ఆ Omicron BF.7 వేరియంట్ కనిపించడం మన దేశంలోని వైద్యులను కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకు గుజరాత్లో 2, ఒడిశాలో ఒకటి ఈ వేరియంట్‌కు సంబంధించిన కేసులను గుర్తించారు. గుజరాత్లో అక్టోబర్ నెలలోనే ఈ Omicron BF.7 ను గుర్తించారు. ఈ వేరియంట్ ఇప్పుడు భారత్ లోనూ మరో వేవ్‌కు కారణమవుతుందా? అనే ప్రశ్న వైద్య నిపుణులను వేధిస్తోంది.
Omicron BF.7
వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీని ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా తక్కువే అని వైద్యులు తెలిపారు..అంటే, వైరస్ సోకిన రెండు రోజుల్లోనే లక్షణాలు ప్రారంభమవుతాయట… అంతర్జాతీయంగా ప్రయాణాలు కరోనా ముందునాటి స్థాయికి చేరిన కారణంగా ఈ Omicron BF.7 వైరస్ కూడా ప్రపంచమంతా వ్యాపించే ముప్పు ఉందని గురుగ్రామ్‌లోని సీకే బిర్లా హాస్పిటల్ లోని సీనియర్ వైద్యుడు రవీంద్ర గుప్తా హెచ్చరిస్తున్నారు.
వ్యాపించే వేగం ఎక్కువ…
ఈ Omicron BF.7 వైరస్ వ్యాపించే వేగం ఇప్పటివరకు వచ్చిన ఏ వేరియంట్ కన్నా అత్యధికమని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తి చుట్టూ ఉన్న వారిలో 10 నుంచి 18 మందికి ఈ వైరస్ సోకుతుందని చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారు, వృద్ధులు, పిల్లలు, డయాబెటిస్, కిడ్నీ, హార్ట్ సమస్యలు ఉన్నవారికి ఈ వేరియంట్‌తో ముప్పు ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే, సాధారణ ప్రజల్లో ఈ Omicron BF.7 వేరియంట్ తో మరణం సంభవించే అవకాశం చాలా తక్కువ అని వివరిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకోవడం వల్ల కొంతవరకు ఉపయోగం ఉంటుందని డాక్టర్ గుప్తా తెలిపారు.
ఈ Omicron BF.7 వేరియంట్ లక్షణాలు..
జలుబు, జ్వరం, గొంతునొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి సాధారణ లక్షణాలే ఉంటాయి. కడుపు నొప్పి, విరోచనాలు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. చైనాలో ఈ Omicron BF.7 వేరియంట్ కారణంగా కనీసం 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని అక్కడి వైద్య నిపుణుడు ఒకరు ఇటీవల ప్రకటించారు. ఈ Omicron BF.7 వైరస్ బారిన పడకుండా ఉండాలంటే కోవిడ్ ప్రొటొకాల్‌ను కచ్చితంగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Omicron BF.7తో భారత్‌కు ముప్పు ఉందా?
ఈ Omicron BF.7 వేరియంట్‌తో భారత్‌కు ముప్పు ఉండకపోవచ్చనే వైద్య నిపుణులు భావిస్తున్నారు. భారత్‌లో అత్యధిక శాతం ప్రజలు రెండు డోసుల టీకా వేసుకుని ఉండడంతో పాటు, కరోనా రెండో వేవ్ సమయంలో మెజారిటీ ప్రజలకు కరోనా సోకిన కారణంగా వారిలో ఇమ్యూనిటీ వచ్చిందని తెలిపారు. ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ వేసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.